ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.విభజన ప్రక్రియపై ఢిల్లీలో ఇవాళ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ముగిసింది.
ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఏపీ భవన్ పై తమకున్న అభిప్రాయాలను కేంద్ర హోంశాఖకు వెల్లడించారు.
దీనిపై వారం రోజుల్లో మరోసారి సమావేశం కానున్నారు అధికారులు.కాగా ఏపీ భవన్ విభజన అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుస్తోంది.
అయితే గత తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ మేరకు తాత్కాలికంగా 58:42 నిష్ఫత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ కొనసాగుతోంది.