మహేష్-త్రివిక్రమ్ మూవీలో మాజీ ప్రపంచ సుందరి.. ఏ పాత్రలో అంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.మరి గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

 Aishwarya Rai In Mahesh Trivikram's Ssmb28, Ssmb28, Mahesh Babu, Trivikram Srini-TeluguStop.com

అయితే ఈ సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్న కూడా ఇంకా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.

మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా వాయిదా పడుతూ వస్తుంది.

ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Mahesh Babu, Ssmb-Movie

ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో ఈసారి మహేష్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

మరి ప్రెజెంట్ అయితే ఫుల్ స్వింగ్ లో యాక్షన్ సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Mahesh Babu, Ssmb-Movie

ఈ సినిమాలో ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా నటిస్తుంది అని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో కీలక పాత్ర ఉందని అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ ఈమెను సంప్రదించినట్టు తెలుస్తుంది.ఐశ్వర్య రాయ్-మహేష్ బాబు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ గా కథ ఉండనుందని తెలుస్తుంది.

ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube