అందాల తార ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగిన అది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె జీవితం ఒక తెరిచిన పుస్తకం.
మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం లో ఏ రోజు ఐశ్వర్య తడబడదు.అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan )తో వివాహం జరిగాక సైతం ఐశ్వర్య జీవితంలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.ఆమెకు ప్రస్తుతం 11 ఏళ్ల వయసు.
అయితే ఐశ్వర్య యాభై ఏళ్ల వయసు లోను చాలా బిజీ గా కెరీర్ ని కొనసాగిస్తుంది.
ఆమె అందం లో కానీ, నటనలో కానీ చిన్న లోటు కూడా ఇప్పటికీ లేదు.ఇక ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరాధ్య బచ్చన్( Aaradhya Bachchan ) కి సంబందించిన కొన్ని ఆసక్తకరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.సోషల్ మీడియాలో ఐశ్వర్య ఎక్కడ ఉంటే ఆరాధ్య బచ్చన్ అక్కడే ఉంటుంది అని, ఐశ్వర్య( Aishwarya Rai ) బిజీ షెడ్యూల్ లో అరాధ్యను తనతో పాటు స్కూల్ కి బంక్ కొట్టి దేశ విదేశాలు తిప్పుతుంది అనే వార్త ఎప్పటి నుంచో ఉంది.
అయితే ఈ విషయం పై ఐశ్వర్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.తను ఎప్పుడూ కూడా టైం మేనేజ్ మెంట్ నీ పాటిస్తాను అని, అలాగే తన ప్లానింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా ఐశ్వర్య చెప్తుంది.
కూతురి స్కూల్ బంక్ కొట్టించే అవసరం లేకుండా తన షెడ్యూల్ ఎప్పుడు వీకెండ్స్ లో మాత్రమే ఉంటుందని, ఏ టూర్ ఉన్న కూడా సోమవారం రోజు ఆరాధ్య స్కూల్ లో ఉండేలా తను ప్లాన్ చేసుకుంటాను అని, అలాగే ఇండియా లో ఏ కంపెనీ ఫ్లైట్ ఏ టైం లో ఏ దేశానికి వెళ్తుందో తనకు చాలా క్లియర్ గా తెలుసు అని అందుకే జెట్ ల్యాగ్ కూడా లేకుండా తన ప్లాన్ ఉంటుంది అని చెప్తుంది.తనకు ఫ్లైట్ మేనేజ్ మెంట్ పెర్ఫెక్ట్ గా చేయడం తెలుసు కాబట్టి కూతురుని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని, వెళ్లిన వీకెండ్ ప్లానింగ్ చక్కగా చేసుకుంటాను అని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు.