నెవార్క్ – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని స్వీడన్ లోని స్టాక్ హోం ఎయిర్ పోర్టులో సేఫ్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎయిర్ పోర్టులో ఫైరింజన్లను సిద్ధంగా ఉంచారు.
కాగా ఫ్లైట్ లో సుమారు 300 మంది ప్రయాణికులు ఉండగా.వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
అయితే బోయింగ్ 777-300 ఈఆర్ ఎయిర్ క్రాఫ్ట్ తో నడిచే విమానంలోని ఓ ఇంజిన్ లో ఆయిల్ లీక్ అయినట్లుగా ఫైలట్లు గుర్తించారు.







