పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు ఓడల ప్రయాణం చేస్తున్నాడు.ఒకవైపు రాజకీయాలు.
మరో వైపు సినిమాలు.ఇలా పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు.2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పవన్ మరో వైపు సినిమాలు కూడా వదలకుండా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు.భీమ్లా నాయక్ తర్వాత మరో సినిమా రిలీజ్ చేయని పవన్ కొత్త సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఉంది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా 40 రోజుల పాటు షూట్ జరగాల్సి ఉంది.
అయితే ఈ సినిమాకు కొద్దీ రోజుల నుండి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యాడు.ఇక ఇప్పుడు ఈ సినిమా కాకుండా మరో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

పవన్ వీరమల్లు పూర్తి కాకుండానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఇంకా ఈయన లైనప్ లో వినోదయం సీతం రీమేక్ కూడా ఉంది.సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా లాంఛ్ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే కారణం తెలియదు కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరపకుండానే డైరెక్ట్ గా షూటింగ్ కు వెళ్ళబోతున్నారు అని టాక్.ఇక తాజాగా ఈ సినిమా షూట్ రేపటి నుండి స్టార్ట్ కాబోతుంది అని పవన్ కళ్యాణ్ రేపటి నుండి ఈ సినిమా సెట్స్ లో బిజీ కాబోతున్నాడు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.
పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మించ బోతున్నాడు.







