'ఆహా' ఈమద్య సందడి తగ్గించేసింది ఏంటో?

తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు కంటెంట్‌ తో మొదలు అయిన ఓటీటీ ఆహా.ప్రముఖ వ్యాపారవేత్త అయిన మై హోమ్స్ రామేశ్వరరావు పెట్టుబడి పెట్టగా అల్లు అరవింద్‌ మరియు దిల్‌ రాజు కూతురు ఆహా లో భాగస్వామ్యులుగా ఉన్నారు.

 Aha Ott Not Giving Big Movies Thease Days , Aha Ott , Aha Ott Movies , Allu A-TeluguStop.com

అల్లు అరవింద్ తన తెలివితో కేవలం ఏడాదిలోనే ఆహా కు మంచి పేరును తెచ్చి పెట్టాడు.అద్బుతమైన సినిమాలను తీసుకు వస్తామంటూ అల్లు అరవింద్ ఆహా ప్రేక్షకులకు పదే పదే హామీలు ఇస్తున్నాడు.

కాని ఆయన తన హామీని మాత్రం నిలుపుకోవడం లేదు.ఇప్పటి వరకు పెద్ద సినిమాలు ఒకటి రెండు మాత్రమే వచ్చాయి.

ఇక గత నెల రోజులుగా సరైన కంటెంట్‌ ను ఆహా ప్రేక్షకులు అందించడం లేదు.

డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ సినిమాలను కొనుగోలు చేయక పోవడం తో పాటు చిన్న సినిమా లను కూడా ఈమద్య ఆహా టీమ్ కొనుగోలు చేయడం లేదు.

దాంతో ఆహా ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.రెండు వారాల క్రితం వచ్చిన గని సినిమా తో పాటు ఎప్పుడో వచ్చిన భీమ్లా నాయక్ లు మాత్రమే ఆహా లో ఇంకా ట్రెండ్‌ అవుతున్నాయి.

మరో వైపు ఆహా లో సింగింగ్‌ షో కొనసాగుతున్నా కూడా జనాలు ఆ షో ను పెద్దగా పట్టించుకోవడం లేదు.ఇక ప్రదీప్‌ సర్కార్‌ షో కాస్త పర్వాలేదు అనిపించడంతో సీజన్ 2 ను నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు ఆ ఎపిసోడ్‌ లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.కాని సినిమాల జోరు మాత్రం మునుపటి మాదిరిగా కనిపించడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

 పెద్ద హీరోల సినిమాల విషయం లో ఎప్పుడూ కూడా ఆసక్తి చూపించని వీరు ఇక ముందు కూడా పెద్ద సినిమా లను తీసుక వచ్చే ఉద్దేశం కలిగి లేరని దీన్ని బట్టి అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube