Agent : ఏజెంట్ నష్టాల సెటిల్మెంట్ కష్టాల్లో మూవీ మేకర్స్.. సురేందర్ రెడ్డి పరిష్కారం చూపించనున్నాడా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) నటించిన తాజా చిత్రం ఏజెంట్( agent ).సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

 Agent Movie Loss Settlement Matter Producer No Reaction Director Safe Game-TeluguStop.com

కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి దారుణంగా డిజాస్టర్ ను చవి చూసింది.ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు ప్రేక్షకులు భావించారు.

అంతే కాకుండా ఈ సినిమాతో అఖిల్ కెరియర్ టర్న్ అవుతుందని కూడా భావించారు.కానీ ఏజెంట్ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.

స్పై యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అంతేకాకుండా విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు కనీసం సినిమా థియేటర్ వైపు వెళ్లడం కూడా మానేశారు.దాదాపు 80కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లు పది కోట్లు కూడా రాలేదు.14కోట్ల గ్రాస్‌, ఏడో కోట్ల నెట్‌ వచ్చింది.కాగా ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ సింగిల్‌గా తీసుకుంది.దాదాపుగా 25కోట్లకి థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకుందని సమాచారం.అంతిమంగా ఇది సుమారు ఇరవై కోట్ల వరకు నష్టాలను చవిచూసింది.

Telugu Tollywood-Movie

నాన్‌ థియేట్రికల్‌గా( Non-theatrically ) నిర్మాతకి మరో ఇరవై, ఇరవైఐదు కోట్ల వరకు వచ్చాయని సమాచారం.అయినా నిర్మాత 20-25కోట్ల నష్టాలను చవిచూశాడట.దీంతో తన సినిమా నష్టాలతో చేతులెత్తేసిన స్థితిలో ఉన్నాడు.

అయితే భారీ మొత్తానికి థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకున్న గాయత్రి ఫిల్స్( Gayathri Phils ) ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.దీంతో నష్టనివారణ చర్యలకు గానూ నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారట.

కనీసం 15కోట్ల మేర అయినా సెటిల్డ్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారట.కానీ తాను కూడా నిండా మునిగానని, తాను ఇవ్వలేనని నిర్మాత అనిల్‌ సుంకర చేతిలెత్తేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

దాంతో గాయత్రి ఫిల్మ్స్ ప్రెజర్‌ ఈ వ్యవహారం దర్శకుడి వైపు టర్న్ తీసుకుందని, ఆయనపై ఒత్తిడి తీసుకొస్తుందని, తమకి సెటిల్మెంట్‌ చేయాలని కోరుతున్నారట.అయితే ఈ సినిమాకి గానూ దర్శకుడికి అధికారికంగా 12కోట్ల పారితోషికం ఇవ్వాలనుకున్నారు.

Telugu Tollywood-Movie

కానీ ఇచ్చింది ఆరు కోట్లే.మిగిలిన ఆరు కోట్లు సినిమా బడ్జెట్‌కి పెట్టాల్సి వచ్చిందట.గతంలో నిర్మాత అనిల్‌ సుంకర( Anil Sunkara ) కూడా ఇదే విషయం చెప్పారు.అందరు మొత్తం పారితోషికం తీసుకుంటే ఇది వంద కోట్ల సినిమా అని, ఈ లెక్కన దర్శకుడు సురేందర్‌రెడ్డి కేవలం 6 కోట్లే తీసుకున్నారట.

తన వద్దకు వచ్చిన గాయత్రి సంస్థ నుంచి సురేందర్‌రెడ్డి స్మార్ట్ గా తప్పించుకునే ప్లాన్ చేశారట.తనకు రావాల్సిన పారితోషికంలో ఆరు కోట్లే ఇచ్చారు.ఇంకా ఆరు కోట్లు రావాల్సి ఉంది.దాన్ని నిర్మాత నుంచి రికవరీ చేసుకోమని చెప్పారట.

అలా ఈ సెటిల్మెంట్‌ వ్యవహారం నుంచి నెమ్మదిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారట.దీంతో ఇప్పుడు గాయత్రి ఫిల్మ్స్ ఏం చేయలేని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube