Natty Kumar : ఏజెంట్ సినిమా గురించి స్పందించిన నిర్మాత నట్టి కుమార్.. సినిమా వెనుక కుట్ర జరిగిందంటూ?

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్.తాజాగా ఈ సినిమా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే.

 Agent Movie Controversy Natty Kumar Comments-TeluguStop.com

కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమా తప్పకుండా అఖిల్ కి సాలిడ్ హిట్ ఇస్తుందని అందరూ భావించినప్పటికీ ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలో అఖిల్ నటన ఫైట్లు బాగానే ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్.

Telugu Controversy, Dil Raju, Natty Kumar, Ponniyin Selvan, Surender Reddy, Toll

సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు అన్న విషయం సినిమాను చూస్తే అర్థమవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.ఇది ఇలా ఉంటే తాజాగా ఏజెంట్ సినిమా గురించి స్పందించిన ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) ని కావాలనే తొక్కి పడేశారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

అంతేకాకుండా ఏజెంట్ సినిమా వెనుక జరిగిన కుట్రలో బడనిర్మాత అయిన ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) శిరీష్ లది ప్రధాన పాత్ర ఉంది అని ఆయన ఆరోపించారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నట్టి కుమార్( Natty Kumar ) ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

Telugu Controversy, Dil Raju, Natty Kumar, Ponniyin Selvan, Surender Reddy, Toll

అఖిల్​ సినిమాకు కావాలనే థియేటర్లు దొరక్కుండా చేశారని, ఏజెంట్ సినిమా వెనుక చాలా రాజకీయాలు,ఎత్తుగడలు ఉన్నాయని నట్టి కుమార్ తెలిపారు.ఎత్తుగడల్లో ముల్లులు కూడా ఉన్నాయని,వాటిని దాటుకుని రావడం అఖిల్​కు నిజంగా పెద్ద టాస్క్.అక్కినేని ఫ్యామిలీ హీరోను తొక్కడానికి దిల్ రాజు పొన్నియిన్ సెల్వన్-2 సినిమాను షిఫ్ట్ చేశారు.తెలుగు సినిమాకి కాకుండా తమిళ మూవీకి ప్రయారిటీ ఇచ్చారు.మణిరత్నం గొప్ప దర్శకుడే కావొచ్చు.

<img src=”https://telugustop.com/wp-content/uploads/2023/04/agent-movie-controversy-natty-kumar-tollywood-Akhil-Akkineni.jpg “/>

కానీ మా వరకు తెలుగు సినిమానే మాకు గొప్ప.ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి తీసిన చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ దొరకకుండా భయ భ్రాంతులకు గురిచేశారు అని చెప్పుకొచ్చారు నట్టి కుమార్.కాగా ఇంటర్వ్యూలో భాగంగా నట్టి కుమార్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube