యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి మనందరికీ తెలిసిందే.షణ్ముఖ్ జస్వంత్ తాజాగా నటించిన సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్.
ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా లో దూసుకుపోతోంది.కాగా ఇటీవల ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా అపేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలంక్రిత షా.ఈమె ఎవరో కాదు ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ జష్వంత్ కు జోడిగా నటించిన ముద్దుగుమ్మనే.
ఈ వెబ్ సిరీస్ లో ఈమె అచ్చం తెలుగు అమ్మాయిల నటిస్తోంది.
కాగా తాజాగా జరిగిన లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చింది అంతే ఆమె పెట్టుకున్న ముక్కుపుడక వల్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది అలంక్రిత షా.ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ లో నా క్యారెక్టర్ చాలా పద్ధతిగా ఉంటుంది.ఇందులో నాకు అవకాశం వచ్చింది అంటే అది నా ముక్కుపుడక వల్లే.
నా యాక్టింగ్ ని చూసినప్పటికీ నా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం నా మక్కుపుడక.నా ముక్కుపుడక చూడగానే షణ్ముఖ్ జశ్వంత్ కి బాగా నచ్చేసింది అది నాకు బాగా ప్లస్ పాయింట్ అయింది అని చెప్పుకొచ్చింది అలంక్రిత షా.ఆ ముక్కుపుడక చూసి నాకు ఆఫర్ ఇచ్చారు.

ఇప్పటికీ కూడా షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ నీ ముక్కుపుడక చూసే నీకు ఆఫర్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు అని తెలిపింది.అయితే ముక్కుపుడక చూసే నీకు అవకాశం ఇచ్చాను అని మొదట షణ్ముఖ్ జశ్వంత్ అన్నప్పుడు ఆమె అలిగిందట.ఎవరైనా స్కిల్స్ చూసి చాన్స్ ఇవ్వాలి కానీ ముక్కుపుడక చూసి చాన్స్ ఇచ్చాను అన్నందుకు నేను అలిగాను.
షణ్ముఖ జశ్వంత్ నాకు నటుడిగా చాలా సపోర్ట్ చేశారు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే హెల్ప్ చేసేవాడు అని చెప్పుకొచ్చింది అలంక్రిత షా.