ప్రతి ఒక్క స్టార్ హీరోయిన్లు హీరోలు హాలీవుడ్ లో సినిమాలు చేసి ఆస్కార్ అవార్డులు అందుకోవాలని ఆశపడుతూ ఉంటారు.అయితే ఒకవేళ ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయినప్పటికీ హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళ స్టార్ హీరో ధనుష్.
తండ్రి దర్శకుడు కావడంతో అలా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.కోలీవుడ్ సినిమాలతో పాటుగా టాలీవుడ్,బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్.
రాన్ జానా సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తాచాటిన ధనుష్ వైదిల్ కొలవెరి సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం తమిళంలో వున్న స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ సినిమాతో హాలీవుడ్ బాట పట్టాడు.2018లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చి మొత్తానికి 2019లో విడుదలైంది.అయితే ధనుష్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
అయితే తాజాగా హాలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నాడు ధనుష్. ది గ్రే మ్యాన్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీని అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ వంటి సినిమాల దర్శకుడు ఆంటోనీ రుస్సో రూపొందించాడు.

ర్యాన్ గోస్లింగ్ క్రిస్ ఎవాన్స్ అన దే ఆర్మస్ జెస్సిక హెన్విక్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఈ మూవీలో ధనుష్ నటించాడు.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని జూలై 22న విడుదల కానుంది.కాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ ని యుఎస్ లో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి హీరో ధనుష్ తన ఇద్దరు తనయులతో కలిసి హాజరయ్యాడు.
అయితే ఈ మూవీ టాక్ ఏమంత బాగాలేదని తెలుస్తోంది.ఇది ధనుష్ కు బిగ్ షాక్ అని చెబుతున్నారు.
హాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించే అవకాశం లభించినా అది ఆశించిన విజయాన్ని సాధించకపోవడం గమనార్హం.







