చాలా మందికి స్నానం చేయాలంటే బద్ధకంగా ఉంటుంది.కొంత మందైతే కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా అలాగే ఉండిపోతారు.
ఓ వైపు చెమట కంపు కొడుతున్నా, అవేమీ పట్టించుకోకుండా రోజుల తరబడి గడిపేస్తుంటారు.ఇలాంటి తరహా పాత్రలను చాలా సినిమాలలో మనం చూసి ఉంటాం.
నిజ జీవితంలోనూ కొందరు అక్కడక్కడా తారస పడుతుంటారు.పోయిన వారమేగా స్నానం చేశాం.
అప్పుడే మళ్లీ చేయాలా అంటూ బద్ధకిస్తుంటారు.ఇలాంటి జాతిరత్నాలకు ఓ నోరులేని జీవి చక్కటి సందేశం ఇస్తోంది.
మనుషుల కంటే శుభ్రంగా స్నానం చేస్తూ, సబ్బు రుద్దుకుంటూ కెమెరాకు చిక్కింది.ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
పెరూలోని హురాజ్ నగరంలో ఓ ఎలుక బాత్‌రూమ్ లో దూరి స్నానం చేసిన వీడియో నెట్టింట పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది.
మనుషుల మాదిరిగానే సబ్బు రాసుకుని, రుద్దుకుని స్నానం కంప్లీట్ చేసింది.బాత్రూమ్ సింక్‌లో తీసిన ఈ వీడియోలో ఎలుక తన వెనుక కాళ్లపై నిలబడి సబ్బు నీటిని ఉపయోగించి ఒళ్లు తోముకుంది.
ఇటీవల ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు భారీగా వ్యూస్, లైకులు దక్కాయి.ఆ వీడియోను చిత్రీకరించిన ఫ్రెడ్ స్కల్ట్జ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఇటీవల పోస్ట్ చేశారు.
దానిని వీడియో తీసిన కొరియా అనే వ్యక్తి దీనిపై స్పందించాడు.తాను స్నానం చేయబోతుండగా ఓ ఎలుక తన కంటే ముందు బాత్రూమ్‌లో దూరడం గమనించానని, అది మనిషి తరహాలో స్నానం చేయడం తనను ఆశ్చర్య పరిచిందని పేర్కొన్నారు.30 సెకన్ల పాటు అది స్నానం చేసిందని, దానిని తాను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టానన్నారు.నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు.







