మెగా హీరో చిరంజీవి త్రిష కాంబినేషన్ లో మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్టాలిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.ఒకరు ముగ్గురికి సహాయం చేస్తే ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ యానీ నటించారు.యానీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టాలిన్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్టాలిన్ సినిమా షూట్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ మరిచిపోలేని ఇన్సిడెంట్ అని యానీ అన్నారు.ఐమ్యాక్స్ లో షూట్ జరిగిందని ఐమ్యాక్స్ వాళ్లు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షూటింగ్ కు అనుమతులు ఇచ్చారని యానీ తెలిపారు.
ఆ ఏజ్ లో డైలాగ్స్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేదానినని డైలాగ్ చెప్పడం లేట్ కావడంతో చిరంజీవి తొందరగా చెప్పాలని మెల్లగా ట్యాప్ చేశారని యానీ తెలిపారు.
చిరంజీవి కొట్టారని భావించి నేను తెగ ఫీలైపోయి షూటింగ్ లో పాల్గొననని అన్నానని యానీ కామెంట్లు చేశారు.
చిరంజీవి అసిస్టెంట్ తో స్ప్రైట్ ఇప్పించి నన్ను కూల్ చేశారని యానీ అన్నారు.ఆ ఏజ్ లో ఆయనే చిరంజీవి అని తెలియదని యానీ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మీరేనా చిరంజీవి అని మెగాస్టార్ చిరంజీవిని అడిగానని యానీ తెలిపారు.నేను అలా అడగటంతో వెనుక ఉన్నవాళ్లంతా షాకయ్యారని యానీ చెప్పుకొచ్చారు.
చిరంజీవి తానే చిరంజీవి అని కూల్ గా రియాక్ట్ అయ్యారని యానీ తెలిపారు.నాకు నీళ్లు అంటే భయం అని యానీ కామెంట్లు చేశారు.
అతిథి సినిమాలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఒకటి ఉందని స్విమ్మింగ్ రాకపోయినా స్విమ్ చేయడంతో మునిగిపోయానని ఆ సమయంలో రాజీవ్ కనకాల నన్ను రక్షించారని యానీ చెప్పుకొచ్చారు.







