విశాఖ ఏజెన్సీ
మాచ్ ఖండ్ పవర్ ప్రాజెక్టు లో గ్రిడ్ ఫెయిల్ కావడంతో ఏజెన్సీ మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.దీంతో జోలాపుట్టు.
ముంచంగిపుట్టు.పెదబయలు.
పాడేరు.జి.మాడుగుల.చింతపల్లి.
హుకుంపేట.డుoబ్రీగూడ.
ఆరకు.అనంతగిరి.
ఎస్.కోట.కొన్ని మైదాన మండలాల్లో విద్యుత్ సరఫరా పూ ర్తిగా నిలిచి పోయింది.దీంతో గిరిజన ప్రాంతంలో ఉన్న గ్రామాలన్ని శనివారం రాత్రి అంధకారంలో ఉన్నాయి.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కారుచీకట్లో మన్యాప్రజాలు గడిపారు.ఏ జెన్సీ మండల కేంద్రాల్లో సైతం ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులకు గురయ్యారు.
మార్చ్ ఖండ్ లో విద్యుత్ అధికారులు.ఉద్యోగులు పవర్ గ్రిడ్ మరామతు పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
శనివారం రాత్రి ఏ సమయంలో విద్యుత్ సరఫరా వస్తుందో చెప్పలేమని ట్రాన్స్కో అధికారులు పేర్కొన్నారు.ఇంటర్ మీడి యెట్ పరీక్షలు జరుగుతున్న దృశ్యా విద్యార్థుల కు ఏ జెన్సీ లో విద్యుత్ సరఫరా లేక పోవడంతో చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.







