సినిమాను మించిన ఎస్కేప్ స్టోరీ.. వీడు మామూలోడు కాదు

సినిమాల్లో చూసిని సీన్లు అప్పుడ‌ప్పుడు నిజ జీవితంలో కూడా చూస్తుంటాం.సినిమాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌నుకుంటాం.

 Prisoner Escapes From Police Custody Being Taken To Cherlapally Jail Details, Kh-TeluguStop.com

ఒక్కోసారి సినిమాల్లో లాగా చేజింగ్స్, గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి.అచ్చం సినిమాలో చూసిన‌ట్లే దొంగ‌త‌నాలు, మ‌ర్డ‌ర్లు జ‌ర‌గ‌డం చూస్తుంటాం, అలాగే త‌ప్పించుకోవ‌టానికి కూడా సినీ ఫ‌క్కిలో స్కెచ్చులు వేస్తుంటారు.

అయితే చ‌ర్ల‌ప‌ల్లి జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ఓ జీవిత ఖైదు విష‌యంలో ఇదే జ‌రిగింది.కోర్టుకు హాజ‌రు కావ‌డానికి వ‌చ్చిన ఆ ఖైది ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఓ కారులో ఊడాయించాడు.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు, సెల్ ఫోన్, ఫాస్టాగ్ ఆధారంగా చేజింగ్ చేసి ప‌ట్టుకుని ఊపిరిపీల్చుకున్నారు.అదేంటో ఇప్పుడు చూద్దాం…

ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండ‌లం దావులూరు గ్రామానికి చెందిన ఐతం ర‌వి శంక‌ర్ అనే వ్య‌క్త‌పై తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 40 కేసులు న‌మోద‌య్యాయి.

అయితే 2019లో హ‌య‌త్ న‌గ‌ర్ లో జ‌రిగిన కిడ్నాప్, రేప్ కేసులో ర‌విశంక‌ర్ చ‌ర్ల‌పల్లి సెంట్ర‌ల్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు.అయితే అక్క‌డి నుంచి ఎలాగైనా త‌ప్పించుకోవాల‌ని స్కెచ్ వేశాడు.

తోటి ఖైది శ్రీ‌ధ‌ర్ అనే వ్యక్తితో ములాఖ‌త్ కు వ‌చ్చిన అత‌ని బంధువ‌ల‌తో ప‌రిచ‌యం పెంచుకుని ఎస్కేప్ కి ప‌క్కా ప్లాన్ వేశాడు.కాగా ఈ నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, వారిని అక్కడికి రావాలని కోరాడు.

అయితే గురువారం ఉదయం రవిశంకర్ ను అంబర్​పేట హెడ్ క్వాటర్స్ కు రిజర్వు పోలీసులు మిర్యాలగూడ తీసుకువచ్చారు.కోర్టులో విచార‌ణ అయిత‌న త‌ర్వాత అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్స్ తో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను రిక్వెస్ట్ చేశాడు.

దీంతో పోలీసులు ఓకే చెప్ప‌డంతో ముందే అనుకున్న ప్లాన్ ని అమ‌లు చేశాడు.

Telugu Khaidi, Miryalaguda, Escapes, Sridhar-Latest News - Telugu

వాళ్లతో మాట్లాడుతున్నట్టు నటించి ముందే అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పక్కనే వారి కారు (టీఎస్ 08జీఎల్ 8818) లోకి స‌డెన్ గా ఎక్కేసి అద్దంకి రోడ్ వైపు జంప్ అయ్యాడు.షాక్ నుంచి తేరుకున్న పోలీసులు స్థానిక పోలీసుల‌కు మ్యాట‌ర్ చెప్పి అలెర్ట్ చేశారు.ప్ర‌త్యేక బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గురజాల వైపు వెళ్తున్నట్లు క‌నిపెట్టారు.

కాసేపటికి ఆ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో ఫాస్టాగ్ ఆధారంగా ప్రయత్నించారు.ఫాస్టాగ్ ఆక్టివేట్ లో లేక‌పోవ‌డంతో రిచార్జ్ చేసి మ‌రి గుర్తించారు.త‌ర్వాత ప్ర‌కాశం జిల్లా పోలీసుల‌కు స‌మాచారం అందించారు.దీంతో ఒంగోలే, చెన్నై హైవేలో పోలీసులు గ‌స్తి నిర్వ‌హించారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మల్లూరు ప్రాంతం వద్ద రవిశంకర్ ను గుర్తించారు.దాదాపు ఏడు కిలోమీటర్లు చేజ్ చేసి టంగుటూరు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.కాగా శుక్ర‌వారం ఉదయం మిర్యాలగూడ కోర్టులో హాజరు పరిచారు.దీంతో పోలీసుల‌ను ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

పోలీసుల బ్రేయిన్ ముందు ఖైదీ బ్రేయిన్ ఓడిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube