Siddharth Aditi Rao Hydari : సిద్దార్థ్ అదితిరావు హైదరీ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్‌( Siddharth ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

 Age Gap Between Newlyweds Aditi Rao Hydari And Hero Siddharth-TeluguStop.com

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ హీరో సిద్దార్థ్‌ పెళ్లి పీటలెక్కాడు.తెలుగు హీరోయిన్‌ అదితి రావు హైదరిని( Aditi Rao Hydari ) పెళ్లాడారు.

వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో( Sri Rangapuram Temple ) వీరిద్దరి పెళ్లికి జరిగింది.రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు.

అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం 2021 చిత్రంలో నటించారు.

ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు.

పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు.అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు.

ఈ జంటకు ఏజ్‌ గ్యాప్‌( Age Gap ) ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.కాగా అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జన్మించింది.

ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు.

Telugu Aditirao, Siddharth, Siddharthaditi, Siddharth Age, Srirangapuram, Tollyw

మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు.వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది.కాగ గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు.అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు.

సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్‌ను( Meghana Narayan ) పెళ్లాడారు.ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు.

Telugu Aditirao, Siddharth, Siddharthaditi, Siddharth Age, Srirangapuram, Tollyw

ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది.హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్‌లో హీరోయిన్‌గా మెరిసింది.మరోవైపు సిద్ధార్థ్.కమల్ హాసన్‌ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు.బాయ్స్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్‌, ఓ మై ఫ్రెండ్‌ చిత్రాలతో మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube