పుల్వామా పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు |10 మంది కి గాయాలు

ఇటీవల పుల్వామా తరహ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.అయితే అలాంటి దాడులు కాకపోయినా పోలీసులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు సరిహద్దుల్లో రెచ్చిపోతున్నారు.

 Again Attack On Pulwama Police Station In Pulwama-TeluguStop.com

వరుసగా దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు.ఈ క్రమంలో నిన్న(మంగళవారం) కూడా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్ దాడి కి పాల్పడ్డారు ఉగ్రవాదులు.

పుల్వామా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.దీనితో ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడగా, వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అధికారులు.

ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

పుల్వామా పోలీస్ స్టేషన్ లక్ష

సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత్ లోనికి చొరబడి ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో భద్రతా దళాలు కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పలువురు అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా.

సోమవారం జరిగిన ఉగ్రదాదుల కాల్పుల్లో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మంగళవారం కూడా పుల్వామా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు దిగడం తో సామాన్య ప్రజలు గాయపాలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube