మెగాస్టార్ అభిమానులకు.. నా ఆర్మీకి సూపర్ థాంక్స్.. ఈ మాటల వెనుక అల్లు అర్జున్ ఆంతర్యం ఏమిటంటే?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది.

అదేమిటంటే ఏ హీరో సినిమా అయినా హిట్ అయితే ఆ హీరో ముందు మెగాస్టార్ అనే బిరుదును చేర్చి ఆ హీరోల పేరును సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై మెగా అభిమానుల మధ్య ఇతర హీరో అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంటోంది.ఇతర హీరోల అభిమానుల మాదిరిగానే అల్లు అర్జున్ అభిమానులు కూడా అల్లు అర్జున్ పేరు ముందర మెగాస్టార్ అని చేర్చి మెగా వేరు అల్లు వేరు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశారు.

ప్రస్తుతం కూడా చేస్తూ ఉన్నారు.ఇకపోతే అల్లు అర్జున్ పలుసార్లు స్టేజిపై తన అభిమానులను ఆర్మీ అని ప్రస్తావించిన విషయం తెలిసిందే.

అయితే బన్నీ నటిస్తున్న సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవుతుండడంతో అల్లు అర్జున్ అలా ఊహించుకున్నారు లేకపోతే ఆ ట్యాగ్ కోరుకున్నాలో తెలియదు కానీ మెగాస్టార్ అన్న బిరుదు కోసం సోషల్ మీడియాలో గట్టిగానే శ్రమించారు.ఇలా ఉంటే తాజాగా వారందరికీ అల్లు స్టూడియోస్ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్.

Advertisement

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.ఈరోజు ఇక్కడికి వచ్చి మా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించి మాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి నా తరపున మా అల్లు కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.

అల్లు స్టూడియోస్ ఆవిష్కరణకు కారణం పర్పస్ ఏమిటనే దానిపై ప్రసంగిస్తూ.అల్లు అర్జున్ తండ్రికి, ఆయన తండ్రి పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ, అంతగా ప్రేమిస్తున్న తన తండ్రికి అభినందనలు తెలిపారు అల్లు అర్జున్.అలాగే కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మెగా అభిమానులకు నన్ను ప్రేమించిన ఆర్మీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాటలను బట్టి చూస్తే మెగాస్టార్ అంటే కేవలం చిరంజీవి అని అర్థమవుతుంది.మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ అభిమానులు మెగాస్టార్ అన్న బిరుదును జోడించడం ఆపేస్తారు లేదంటే అలాగే కంటిన్యూ చేస్తారో చూడాలి మరి.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు