మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా అనంతరం ఈయన సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు.వెంకీ మామ ఫేమ్ డైరెక్టర్ ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నిర్మించిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలో మొదటిసారిగా శృతిహాసన్ చిరంజీవితో జతకట్టారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ బాబీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చూశారని బాబి తెలిపారు.

ఈ సినిమా చూసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ఒకే ఒక్క మాట అన్నారని బాబి తెలిపారు.సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంతో చాలా సంతోషం వేసిందని ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలై చిరంజీవి గారి మాటలు నిజమవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బాబి తెలిపారు.ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెన్స్ గా ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.







