అండగా నేనుంటా.. ఏ అవసరం వచ్చినా చెప్పండి మెగా ఫ్యాన్స్ మీట్ లో నాగబాబు కామెంట్స్!

సాధారణంగా సంక్రాంతి అంటేనే తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండగ అలాగే సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది.సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు బరిలోకి దిగి నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి.

 Ill Be There Whatever You Need Say Nagababus Comments In The Mega Fan Meet, San-TeluguStop.com

క్రమంలోని ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు పోటీకి సై అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు రెండు సంక్రాంతికి విడుదల కానున్నాయి.

ఇలా ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఒక అడుగు ముందుకెళ్లి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే వాల్తేరు వీరయ్య కోసం కూడా మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు సైతం రంగంలోకి దిగారు.

Telugu Ill, Fan Meet, Mythri Makers, Nagababus-Movie

ఈ క్రమంలోనే హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా అభిమానులు వచ్చారు.ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఈ చిత్రం దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ.అభిమానులు ఎవరూ కూడా నిర్మాతలతో గొడవ పడకూడదని కేవలం వారికి సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు.ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల ఇష్యూ ఉంది.

ఈ క్రమంలోని థియేటర్ల గురించి నాగబాబు మాట్లాడుతూ.వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యేలా చూస్తామని తెలిపారు.

ఇక మెగా ఫాన్స్ కి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.అందరూ కలిసికట్టుగా ఉండి సినిమా విజయానికి దోహదపడాలని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube