దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి( Hero Dheekshith Shetty ) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించింది.
దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చెంద్( Kilaru Prem Chand ) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది.
ప్రస్తుతం కన్నడలో దీక్షిత్ శెట్టి పలు సినిమాలు చేస్తున్నారు.అందులో ‘బ్లింక్’ ‘కెటిఎమ్’ ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ మూవీస్ ఉన్నాయి, ఇది తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.‘దసరా'( Dasara )తో తెలుగులో దీక్షిత్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది.అందువల్ల, అతడు నటించే కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.