అప్పుడు అఖండ.. ఇప్పుడు స్కంద.. బాక్సులు బద్దలు కొడుతున్న థమన్!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ తమన్( Thaman ) ఒకరు.

ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.

థమన్ ప్రెసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.ఈయన చేస్తున్న ఒక్కో ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతూ సూపర్ హిట్ అవడమే కాకుండా అభిమానుల గుండెల్లో నిలిచి పోతున్నాయి.

తమన్ అల వైకుంఠపురములో సినిమా దగ్గర నుండి వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నాడు.థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను సగం హిట్ గా నిలబెడుతూ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

గత ఏడాది క్రాక్,( Krack ) అఖండ( Akhanda ) వంటి సినిమాల విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన థమన్ ఈ ఏడాది కూడా సాలిడ్ విజయాలతో దూసుకు పోతున్నాడు.

Advertisement

ఇక తాజాగా బోయపాటి రామ్ స్కంద సినిమాకు( Skanda Movie ) థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాక్సులు బద్దలు అవుతున్నాయి.రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ స్కంద.శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నిన్న సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది.బోయపాటి థమన్ నుండి ఎంత అవుట్ ఫుట్ కావాలో అంత తీసుకోవడంలో దిట్ట.అఖండ సమయంలోనే వీరి కాంబోలో మూవీ ఎలా ఉంటుందో చూసాం.

ఇక ఇప్పుడు స్కంద కోసం అంతకంటే బాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థమన్ చంపేశాడు.తెలుగు రాష్ట్రాల్లో ఈయన దెబ్బకి బాక్సులు బద్దలయ్యాయి.దీంతో థమన్ మళ్ళీ తన వర్క్ తో తెలుగు ఆడియెన్స్ ను బాగా ఇంప్రెస్ చేసి స్కంద సినిమా విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు