8 ఏళ్ళ తర్వాత తెలుగు లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి రేర్ రికార్డు..ఎవరికీ సాధ్యం కాదు!

సౌత్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) మేనియా నే కనిపిస్తుంది.ఆయన హీరో గా నటించగిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్’ కి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం తో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తాని చాటుతున్నాడు.

 After 8 Years, Telugu Superstar Rajinikanth Has A Rare Record..no One Can Do It,-TeluguStop.com

ఆమ్మో రజినీకాంత్ స్టార్ స్టేటస్ ఈ రేంజ్ లో ఉంటుందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే రేంజ్ లో ఆయన తెలుగు , తమిళ బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్నాడు.మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా , మూడు రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక తెలుగు మార్కెట్ లో అయితే ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ని డామినేట్ చేస్తుంది.ఒక తమిళ డబ్బింగ్ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమాని డామినేట్ చేసింది అంటే సాధారణమైన విషయం కాదు.

Telugu Bollywood, Drshivarajkumar, Jailer, Peddanna, Rajinikanth, Tamannaah, Tol

ఇకపోతే తెలుగునాట రజినీకాంత్ కి మార్కెట్ పోయి చాలా సంవత్సరాలు అయ్యింది.గత 8 ఏళ్ళ నుండి ఆయనకీ ఇక్కడ ఒక్క హిట్ కూడా లేదు.బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి.ఆయన గత చిత్రం ‘పెద్దన్న’ ( Peddanna Movie )అయితే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఒకప్పుడు రజినీకాంత్ సినిమా అంటే తెలుగు హీరోల సినిమాలు కూడా బయపడేవి.అలాంటిది ఇప్పుడు కోటి రూపాయిల ఓపెనింగ్ కొట్టే స్థాయికి పడిపోయాడంటే ఆయన మార్కెట్ ఎలా డౌన్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి స్థాయి నమ్మేది ‘జైలర్’ చిత్రం తో మొదటి రోజు 7 కోట్ల రూపాయిల షేర్ ని కొట్టే రేంజ్ కి వచ్చాడంటే ఈ ‘జైలర్’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం అవుతుందా!.

Telugu Bollywood, Drshivarajkumar, Jailer, Peddanna, Rajinikanth, Tamannaah, Tol

ఇది ఇలా ఉండగా జైలర్ చిత్రం ( Jailer Movie )తెలుగు నాట మూడు రోజుల్లో దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల్లోకి వచ్చింది.ఫుల్ రన్ లో కచ్చితంగా 30 కోట్ల రూపాయిలు కొల్లగొడుతుంది అనే నమ్మకంతో ఉన్నారు బయ్యర్స్.

ఇక రాబొయ్యే రోజుల్లో ఆగష్టు 15 వ తీరీఖు నేషనల్ హాలిడే.ఇక ఆరోజు ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube