తాపీ మేస్త్రిలు డైలీ ఈజీగా రూ.1000- 1,500 డబ్బులు సంపాదిస్తారు ఆ లెక్కను చూసుకుంటే నెలకు రూ.30- 40 వేలు వారు సంపాదించగలరు.కానీ వారికి ప్రతిరోజు పని దొరకడం కష్టం.
వర్షాకాలం వంటి సీజన్లలో వారు ఇంట్లో కూర్చోవాల్సిందే.అయితే ఈ తాపీ మేస్త్రి( Mason Workers ) వృత్తిని ఒక ఉద్యోగంగా పరిగణిస్తూ వారిని నియమించుకునేందుకు అమెరికా కాన్సులేట్( US Consulate ) తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.తాపీ మేస్త్రి ఉద్యోగంలో చేరిన వారికి నెలకు అక్షరాల రూ.4,47,348 ఇస్తామని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది.
హైదరాబాద్‌లోని( Hyderabad ) అమెరికా కాన్సులేట్‌లో మాసన్ లేదా తాపీ మేస్త్రి కోసం ఈ జాబ్ నోటిఫికేషన్( Job Notification ) విడుదల అయింది.జీతంతో పాటు ఇతర అలెవెన్సులు అందించనున్నట్లు ఈ ఉద్యోగ ప్రకటనలో రాశారు.ఆసక్తిగల తాపీ మేస్త్రిలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 25 అని గమనించాలి.ఆసక్తి, తాపీ పనిలో మంచి స్కిల్స్ ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు.
యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ఆఫీసుకు వెళ్లి ఈ ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా పూర్తి చేస్తారన్న వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడించలేదు.యూఎస్ కాన్సులేట్ వెబ్‌సైట్, ఆఫీసుకు నేరుగా వెళ్లి ఎంపిక ప్రక్రియ గురించి ఆరా తీయవచ్చు.అయితే ఈ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది తాపీ మేస్త్రికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ శాలరీ ప్రకటించారు కదా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ కంపెనీ అంత శాలరీ ఎందుకు ప్రకటించిందో, ఎలాంటి కఠిన రూల్స్ పెడుతుందో ప్రస్తుతానికైతే తెలియ రాలేదు.