మూడేళ్లకే పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లు... తరగతులు ఏ విధంగా నిర్వహిస్తారంటే...

ఆ రంగురంగుల గోడలపై అసంఖ్యాకమైన ఊహా చిత్రాలు.ఇది కలల మేఘం ఏమీ కాదు.

 Admissions Of Children In Schools For Only Three Years... How Are The Classes Or-TeluguStop.com

వాస్తవానికి కొత్త విద్యా విధానం ప్రకారం చండీగఢ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న పిల్లలకు బోధించడానికి బాల వాటిక ప్రారంభమయ్యింది.కొత్త విద్యా విధానం (NEP) 2020 ప్రకారం నగరంలోని మొత్తం 112 ప్రభుత్వ పాఠశాలల్లో బాల వాటిక తరగతులను ప్రారంభించి, దేశంలోనే మొదటి రాష్ట్రంగా చండీగఢ్( Chandigarh ) అవతరించింది.

నూతన విద్యా విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లకు బదులు మూడేళ్లకే పిల్లలను చేర్చుకుంటారు.మూడేళ్ల పిల్లలకు సృజనాత్మకంగా బోధించేందుకు విద్యాశాఖ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంది.

Telugu Balvatika, Balavatika, Chandigarh, Public Schools, Schools-Latest News -

ఈ మేరకు ఇన్ఫోసిస్‌ కంపెనీ, కచ్చి సడక్‌ ఫౌండేషన్‌లు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి.ప్రవేశద్వారం నుంచి తరగతి గది వరకు పిల్లలు ఆడుకుంటూనే పాఠశాల వేళలను పూర్తి చేసేలా ఓ కార్నర్‌ను సిద్ధం చేశారు.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాల్ వాటికా క్లాస్ కార్నర్ కోసం ప్రత్యేక ఆకర్షణీయమైన గేట్లను సిద్ధం చేశారు.

Telugu Balvatika, Balavatika, Chandigarh, Public Schools, Schools-Latest News -

క్లాస్ రూం కార్నర్ ప్రారంభం నుంచి వివిధ చోట్ల ఆకర్షణీయమైన ఫర్నీచర్, ఆటవస్తువులు ఏర్పాటు చేయడంతో తరగతి గదిలో కూర్చొని పిల్లలు ఆడుకుంటూ అన్నీ నేర్చుకుంటున్నారు.బాల్ వాటిక కోసం సిద్ధం చేసిన మూలలో గణితం నుండి సాధారణ జ్ఞానం వరకు సమాచారాన్ని అందించే సృజనాత్మక కళాఖండాలు సిద్ధం చేశారు.

Telugu Balvatika, Balavatika, Chandigarh, Public Schools, Schools-Latest News -

బాల్ వాటికా( Balavatika ) కొత్త విద్యా విధానం 2020 ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం మూడేళ్ల వయస్సు నుంచే ఉంటుంది.ఒకటవ తరగతికి రాకముందే బాల వాటిక ఒకటి, రెండు, మూడు తరగతులు చదవాలి, ఆరేళ్ల వయసులో పిల్లలు ఒకటవ తరగతిలో ప్రవేశిస్తారు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో( Public Schools ) బాల వాటిక తరగతులకు ప్రత్యేక గదులు, ఇతరత్రా సరంజామా సిద్ధం చేయడమే కాకుండా నైపుణ్యానికి సంబంధించిన విద్యను అందించడానికి వివిధ సంస్థలతో సమన్వయం చేసుకున్నారు.వివిధ పాఠశాలల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి వివిధ పనులు జరుగుతున్నాయి.

కుండలు, పెయింటింగ్‌తో సహా వివిధ కళాకృతులను రూపొందిందించే కళాకారులు ఈ పనుల్లో భాగస్వామ్యం వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube