స్మార్ట్‌ఫోన్( Smart phone ) వినియోగం విరివిగా పెరిగిపోవడంతో కేటుగాళ్ల మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి.ఇక వారి మోసాలు చాలవన్నట్టు కొందరు టెకీలు పనికిమాలిన యాప్స్ తో ఐటెక్ మోసాలను పాల్పడుతున్నారు.
అవును, తాజాగా ఓ కొత్త మాల్వేర్ స్మార్ట్‌ఫోన్ ( Malware smartphone )యూజర్లకు ఝలక్ ఇచ్చింది.ప్రముఖ సెక్యూరిటీ సంస్థ మెకఫీ తాజాగా ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.
ఈ నేపథ్యంలో 60కి పైగా యాప్స్‌లో గోల్డోసన్ మాల్వేర్( Goldoson Malware ) ఉందని తెలిపింది.వీటిని ఏకంగా 10 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని కూడా పేర్కొంది.

ఈ యాప్స్ డెవలపర్లు అనుకోకుండా థర్డ్ పార్టీ లైబ్రరీని ఉపయోగించడం ద్వారా మాల్వేర్ యాప్స్‌లోకి వచ్చి చేరినట్టు మెకఫీ( McAfee ) తెలిపింది.ఈ మాల్వేర్ వలన జరుగుతున్న మోసం ఏమిటంటే, మీ ఫోన్‌లో ఎన్ని యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయి, అలాగే పేరు, కనెక్టెడ్ డివైజ్‌లు వివరాలను కలెక్ట్ చేస్తోందని రీసెర్చర్లు వెల్లడించారు.ప్రతి 2 రోజులకు ఒకసారి డేటా కలెక్షన్ ప్రాసెస్ జరుగుతుందని కూడా ఈ నేపథ్యంలో తెలిపారు.తర్వాత ఈ మాల్వేర్ అనేది ఫ్రాడ్ యాడ్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేస్తుందని పేర్కొన్నారు.
ఇక గూగుల్‌కు కూడా ఈ మాల్వేర్ గురించి తెలుసని, అందుకే ఈ మాల్వేర్ ఉన్న యాప్స్ అన్నింటినీ ప్లేస్టోర్ నంచి తొలగించిందని కూడా మెకఫీ ఈ సందర్భంగా ఓ శుభవార్త చెప్పింది.ఏ ఏ యాప్స్‌లో మాల్వేర్ ఉందో తెలుసా?

ఎల్.పాయింట్ విత్ ఎల్.పే, స్వైప్ బ్రిక్ బ్రేకర్, మనీ మేనేజర్ ఎక్స్‌పెన్స్ అండ్ బడ్జెట్, టీఎంఏపీ, లోట్టే సినిమా, జెనీ మ్యూజిక్, కల్చర్‌ల్యాండ్ వెర్షన్, జీఓఎం ప్లేయర్, మెగా బాక్స్, లైవ్ స్కోర్ రియల్ టైమ్ స్కోర్, పికికాస్ట్, కాంపాస్ 9 స్మార్ట్ కంపాస్, జీఎంఓ ఆడియో మ్యూజిక్ లిరిక్స్, టీవీ ఆల్ అబౌట్ వీడియో, జునిడే, ఐటెమ్ మానియా, లొట్టే వరల్డ్ మ్యాజిక్ పాస్, బౌన్స్ బ్రిక్ బ్రేకర్, ఇన్‌ఫినిట్ స్లైస్ ఇన్‌ఫినిట్ స్లైస్, నోరే బ్యాంగ్, సోమ్‌నోట్ బ్యూటిఫుల్ నోట్ యాప్, కొరియా సబ్‌వే ఇన్ఫో మెట్రాయిడ్, గుడ్ టీవీ బైబిల్, హ్యాపి మొబైల్ హ్యాపీ స్క్రీన్, యూబైండ్ మొబైల్ ట్రాకర్ మేనేజర్, మఫూ డ్రైవింగ్ ఫ్రీ, గర్ల్ సింగర్ వరల్డ్ కప్ ఎఫ్‌ఎస్‌పీ మొబైల్, ఆడియో రికార్డర్, క్యాట్‌మెరా, కల్చర్‌ల్యాండ్ ప్లస్, సింపుల్ ఎయిర్, లోట్టే వరల్డ్ సియోల్ స్కై, స్నేక్ బాల్ లవర్, ప్లే గెటో, మెమరీ మెమో, పీబీ స్ట్రీమ్, మనీ మేనేజర్ (రిమూవ్ యాడ్స్), ఇన్సాటికాన్ క్యూట్ ఎమోటికాన్స్, ఇక్లౌడ్, ఎస్‌సినిమా, టికెట్ ఆఫీస్, లొట్టే వరల్డ్ ఆక్వారియమ్, లొట్టే వరల్డ్ వాటర్ పార్క్, టీ మ్యాప్ ఫర్ కేటీ ఎల్‌జీయూ, ర్యాండమ్నంబర్, ఏఓజీ లోడర్, జీఎంఓ ఆడియో ప్లస్ మ్యూజిక్, స్వైప్ బ్రిక్ బ్రేకర్, సేఫ్ హోమ్, చున్‌చియోన్, ఫాంటాహోలిక్, సినిక్యూబ్, టీఎన్‌టీ, బెస్ట్‌కేర్ హెల్త్, ఇన్‌పినిటీ సొలిటైర్, న్యూ సేఫర్, క్యాష్ నోట్, టీడీఐ న్యూస్, ఐటెస్టింగ్, టింగ్ సెర్చ్, క్రిషాచు ఫ్యాంటాస్టిక్, యోఆన్హగూగోకా.







