ఈనెల ఆఖరిలోపు సీట్ల సర్దుబాటు నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

2014లో గెలిచిన విధంగా వచ్చే ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నాయి.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు( Pawan Kalyan Chandrababu ) అనేకసార్లు భేటీ కావటం కూడా జరిగింది.అంతేకాదు త్వరలో ఎన్నికల ప్రచారంలో కలసి బహిరంగ సభలలో కూడా పాల్గొనబోతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా గురువారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్చార్జిలతో నాదెండ్ల మనోహర్( Nadendla Manohar )సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తులో.సీట్ల సర్దుబాటు గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

ఈనెలాఖరులోపు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో టికెట్ రాలేదని ఎవరు నిరుత్సాహ పడకూడదని ఇన్చార్జిలకు సూచించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం జనసేన( Telugu Desam Janasena ) పొత్తులో భాగంగా టికెట్ ఎవరికీ వచ్చిన గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు