'మేజర్‌' కు విమర్శకుల ప్రశంసలు.. మరి కలెక్షన్స్‌ వచ్చేనా?

రియల్‌ హీరో మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం మేజర్‌.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు రివ్యూవర్స్ మూడు కు పైగానే రేటింగ్‌ ఇచ్చారు.

ఇక ప్రేక్షకులకు కూడా సినిమా కు చాలా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.ఇలాంటి సినిమా లను జనాలు నెగటివ్‌ గా అస్సలు ప్రచారం చేయరు.

ఒక వేళ బాగో లేకున్నా కూడా సినిమా గురించి సైలెంట్ గా ఉంటారు తప్ప బాగో లేదు అనే మాట మాత్రం రాదు.మేజర్‌ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

కాని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా ను చూడ్డానికి మాత్రం థియేటర్‌ కు వెళ్తారు అనుకోవడం లేదు.సినిమాకు మహారాజ పోషకులు అయిన ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్‌ మేజర్ సినిమా ను ఎంత వరకు ఆధరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

మేజర్ సినిమా ఖచ్చితం గా అవార్డు విన్నింగ్‌ మూవీ అనడం లో సందేహం లేదు.ఇలాంటి ఒక అవార్డు విన్నింగ్ మూవీ ని జనాలు ఆధరించిన దాఖలాలు చాలా తక్కువ.

కాని మేజర్ ను ఒక కమర్షియల్‌ మూవీగా పబ్లిసిటీ చేయడం వల్ల మంచి హైప్ అయితే క్రియేట్‌ అయ్యింది.దానికి తోడు బ్రేక్‌ ఈవెన్‌ లెక్కలు కూడా చాలా తక్కువే ఉన్నాయి.

కనుక మేజర్‌ ఒక మోస్తరు గా వసూళ్లు నమోదు అయినా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొదటి రెండు మూడు రోజుల వరకు వసూళ్ల విషయంలో కాస్త అటు ఇటుగానే ఉండే అవకాశం ఉంది.

అయినా కూడా మేజర్ ను జనాలు ఎంత వరకు ఆధరిస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు