ఈ ఒక్క ప్యాక్ వేసుకుంటే హెయిర్ ఫాల్‌కు ఈజీగా అడ్డుక‌ట్ట వేయొచ్చు!

ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.ప్ర‌తి రోజు వెంట్రుక‌లు రాలిపోతూ జుట్టు ప‌ల్చ‌బ‌డిపోతుంటే.

 Super Powerful Pack For Hair Fall! Powerful Hair Pack, Hair Fall, Hair Care, Hai-TeluguStop.com

అందం త‌గ్గిపోతుంద‌ని కొంద‌రు, పెళ్లి కాద‌ని మ‌రికొంద‌రు టెన్ష‌న్ ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే త‌మ‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోతారు.

ప‌నిపై ఏక్ర‌త పెట్ట‌లేక కోరుకున్న రంగంలో రాణించ‌లేక వెనుకబడిపోతుంటారు.ఈ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే ఇక‌పై అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ ప్యాక్‌ను వారంలో ఒక్క‌సారి వేసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు ఈజీగా అడ్డుక‌ట్ట వేయొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు, మూడు బాదం ప‌ప్పులు వేసుకుని వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే నువ్వుల‌ను, బాదం ప‌ప్పుల‌ను రెండు సార్లు వాట‌ర్‌తో క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత బాదం ప‌ప్పుల‌కు ఉన్న తొక్క‌ను తొల‌గించి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, నాన‌బెట్టుకున్న నువ్వులు, బాదం ప‌ప్పులు, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను స‌ప‌రేట్ చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Problems, Latest, Packfall-Telugu Health Tips

ఇక ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల అర‌టి పండు గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో ఒక్క‌సారి చేస్తే ఖ‌చ్చితంగా జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube