తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో నటుడు అడివి శేష్ ఒకరు.తాజాగా ఈయన హిట్ 2సస్పెన్స్ త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఈయన నటించిన గూడచారి సినిమాకు సీక్వెల్ చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అడివి శేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.అయితే ఇది తన సోదరి వివాహ వేడుకలు కావడం విశేషం.ఇలా తన చెల్లెలు పెళ్లిలో ఈయన ఎంతో సందడి చేస్తూ ఈ వేడుకను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తన చెల్లెలు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా శేష్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా సోదరి పెళ్లిలో నేను అమ్మ ఎంతో ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చారు.ఈరోజు బావ డేవిన్ కు మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము అంటూ ఈయన ఈ ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ మరి నీ పెళ్ళెప్పుడు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇదివరకే ఈయన అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కారు.ఇక తాజాగా క్రిస్మస్ వేడుకలలో భాగంగా అక్కినేని కుటుంబంతో కలిసి శేష్ సందడి చేయడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి.