ఉత్కంఠ క‌లిగిస్తున్న ఆదిపురుష్ చిత్రం... ఈ విశేషాలు, వివాదాల గురించి తెలుసా?

2023వ సంవత్సరంలో అంద‌రూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆదిపురుష్( Adipurush ) ప్ర‌ధ‌మ స్థానంలో నిలుస్తుంది.నటుడు ప్రభాస్( Prabhas ), నటి కృతి సనన్‌ల‌ చిత్రం ఆదిపురుష్ ట్రైలర్ మే 9న విడుదల కానుంది.

 Adipurush's Exciting Film... Do You Know About These Features And Controversies?-TeluguStop.com

ఈ తేదీన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, థియేటర్‌లలో ఆదిపురుష్ సినిమా ట్రైలర్‌ను ఏకకాలంలో చూడవచ్చు.ప్రపంచవ్యాప్తంగా విడుదల‌య్యే ట్రైలర్‌తో ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ ప్రభు నటిస్తుండగా, సీతా మాతగా నటి కృతి సనన్ నటిస్తోంది.ఈ సినిమాలో లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.

మెగా లాంచ్‌ను ప్రకటిస్తూ నటుడు ప్రభాస్ తో కూడిన కొత్త పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Latest

విడుదలకు ముందే పెద్ద మైలురాయిఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్( Om Raut , ) దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఇప్పటికే ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్ కోసం ఈ చిత్రం ఎంపిక అయ్యంది.

చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన ఉత్కంఠను రేకెత్తించింది.ఇప్పుడు టీమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది.

ఈ ట్రైలర్ భారతదేశంలోనే కాకుండా 70 దేశాలలో ప్రదర్శితం కానుంది.ఇది నిజంగా గ్లోబల్ ఈవెంట్‌గా గుర్తింపుపొందింది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Latest

ఈ దేశాల్లోనూ ప్ర‌సారంఈ గ్రాండ్ లాంచ్ భారతదేశంలోనే కాకుండా USA, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్, ఆఫ్రికాతో సహా ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాలలో ప్ర‌సారం కానుంది.యూకే, ఐరోపా, రష్యా, ఈజిప్ట్ మొదలైన దేశాలలో కూడా ప్ర‌సారం కానుంది.ఈ గొప్ప కథ ప్రేక్షకులను ఆకర్షించ‌నుంది.సాహసం, డ్రామా మరియు యాక్షన్ ప్రపంచానికి పరిచయం కానుంది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Latest

2023 జూన్ 16 న విడుదల ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని టి-సిరీస్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, యువి క్రియేషన్స్‌పై ప్రసాద్ మరియు వంశీ నిర్మించారు.ఈ చిత్రం 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.వివాదం ఇలా..ఆదిపురుష్‌ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి దీనిపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.కొన్నిసార్లు రావణుడి లుక్‌పై, కొన్నిసార్లు హనుమంతుడిపై, మరికొన్నిసార్లు రాముడి లుక్‌పై తీవ్ర చర్చ జరగగా, రామ నవమి సందర్భంగా ఆదిపురుష కొత్త పోస్టర్‌ను విడుదల చేసినప్పుడు, చాలా వివాదాలు, ఫిర్యాదులు దాఖలయ్యాయి.

దీని తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని లుక్ తెరపైకి రావడంతో దానిపై కూడా చాలా రచ్చ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube