ఆది పురుష్ థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం థియేటర్ అద్దాలన్ని ద్వంశం!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటించిన ఆది పురుష్ సినిమా (Adipurush Movie) ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 Adipurush Prabhas Fans Broke Theater Glasses Details, Prabhas,hanuman,adipurush-TeluguStop.com

ఇలా ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు కూడా థియేటర్లకు తరలి వెళ్తున్నారు.అయితే సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న తరుణంలో సినిమా ప్రదర్శన విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తిన నిమిషం ఆలస్యమైనా కూడా అభిమానులు ఏమాత్రం సహించడం లేదు ఈ క్రమంలోనే కొన్ని థియేటర్లలో అభిమానులు కాస్త అత్యుత్సాహం కనబరుస్తూ థియేటర్లను ద్వంశం చేస్తున్నారు.

Telugu Adipurush, Hanuman, Jyothi Theater, Kriti Sanon, Om Raut, Prabhas, Prabha

తాజాగా రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో( Jyothi Theater ) ఈ సినిమాని కాస్త ఆలస్యంగా ప్రదర్శించారు.ఇలా సినిమా పడటం కాస్త ఆలస్యం కావడంతో అభిమానులు థియేటర్ యాజమాన్యంతో పెద్ద ఎత్తున గొడవకు దిగారు.అయితే సిబ్బంది చెప్పడంతో గొడవ సద్దుమణిగిన థియేటర్ లోపలికి వెళ్ళగానే అసలు గొడవ మొదలైందని తెలుస్తుంది.సౌండ్ సిస్టం సరిగా పనిచేయకపోవడంతో డైలాగ్స్ ఏమాత్రం క్లారిటీగా లేవని ఆందోళన చేశారు.

ఇలా సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో మరోసారి థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు.ఈ క్రమంలోనే అభిమానులు ఏకంగా థియేటర్ అద్దాలను పగలగొట్టారు.

Telugu Adipurush, Hanuman, Jyothi Theater, Kriti Sanon, Om Raut, Prabhas, Prabha

ఈ విధంగా అభిమానులు థియేటర్ ను ధ్వంసం చేయడంతో థియేటర్ యాజమాన్యం ఏకంగా సినిమా ప్రదర్శన కూడా నిలిపివేశారు.ఇలా సినిమా విషయంలో ఏమాత్రం ఆలస్యం అవుతున్న అభిమానులు థియేటర్లను ధ్వంసం చేస్తున్న ఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి.ఇక ఈ సినిమా ప్రదర్శింపబడిన ప్రతి ఒక్క థియేటర్లోనూ హనుమంతుడి(Hanuman) కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని సూచించిన విషయం మనకు తెలిసిందే.అయితే కొన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీటును ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి హనుమంతుడు చిత్రపటాన్ని పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube