టాలీవుడ్ లో రాజమౌళి( Rajamouli ) కి ధీటుగా మార్కెట్ ఉన్న హీరో కానీ డైరెక్టర్ కానీ లేదని అంటుంటారు ట్రేడ్ పండితులు.మగధీర చిత్రం నుండి ప్రారంభమైన రాజమౌళి మేనియా, #RRR చిత్రం తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళింది.
ఆయన మార్కెట్ ని అందుకునే స్టార్ ఇప్పట్లో ఎవ్వరూ రాలేరని అనుకున్నారు.కానీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాకి మన తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి తో సరసమైన మార్కెట్ చేసే రేంజ్ ఉందని, అతి త్వరలోనే విడుదల అవ్వబోతున్న ‘ఆదిపురుష్’( Adipurush ) చిత్రం రుజువు చేసింది.
ఈ సినిమా కి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్ యూవీ క్రియేషన్స్ సంస్థ నుండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 170 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని నిన్న సోషల్ మీడియా( Social media ) లో వచ్చిన ఒక వార్త సెన్సేషన్ సృష్టించింది.ఇప్పటి వరకు రాజమౌళి #RRR చిత్రానికి తప్ప ఏ సినిమాకి కూడా ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ మన తెలుగు స్టేట్స్ లో జరగలేదు.

రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 200 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది.మళ్ళీ దీనిని కొట్టాలంటే రాజమౌళి సినిమా రావాల్సిందే అని అనుకున్నారు, కానీ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం తో చాలా అలవోకగా ఆ బిజినెస్ ని అందుకున్నాడు.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట.ప్రభాస్ కి మొదటి నుండి నైజాం ప్రాంతం లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఆయన సినిమాలు ఇక్కడ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన వసూళ్లు రాబడుతుంటాయి.ఆయన గత చిత్రం ‘రాధే శ్యామ్( Radhe Shyam )’ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ, నైజాం ప్రాంతం లో 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
కొంతమంది మన స్టార్ హీరోలకు సూపర్ హిట్ చిత్రాలకు కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు.

రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రాన్ని కూడా ఇలాగే 70 కోట్ల రూపాయలకు ఈ ప్రాంతం నుండి కొనుగోలు చేసారు.ఫుల్ రన్ లో ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది.ఇప్పుడు ‘ఆదిపురుష్‘ చిత్రానికి #RRR రేంజ్ రన్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టం.
మరి ఆ రేంజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ట్రైలర్ మరియు పాటలు అదిరిపోయాయి, ఓవర్సీస్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, అక్కడ 1 మిలియన్ డాలర్స్ కేవలం ప్రీమియర్స్ నుండి రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూసి.ఇక ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6 వ తేదీన జరగనుంది.







