లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఆది శ్రీనివాస్

స్థానిక శాసనసభ్యుడి వైఫల్యం.వేములవాడ( Vemulawada ) చుట్టూ అష్టదిగ్బంధం.

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్( Adi Srinivas )వేములవాడ పట్టణం లో బుడగ జంగాల కాలనీ, సౌరాల కాలనీ, మల్లారం రోడ్ లో ఉన్న కాలనీలలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని సందర్శించి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆర్డిఓ,ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే వారికి వసతులను కల్పించాలని కోరారు.

అనంతరం ఆది శ్రీనివాస్ వారికి తినడానికి పండ్లను, బిస్కెట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వర్షాకాలం వచ్చినప్పుడల్లా చూడడం వెళ్లడం తప్ప దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

వర్షాకాలం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతమైన బుడగ జంగాల కాలనీ అయినా సౌరాల కాలనీ అయిన.వారికి హామీ ఇవ్వడం, మర్చిపోవడం వల్ల దిగువకు నీరును పంపకపోవడం వల్ల కాలనీలు మునిగిపోవడం జరుగుతుందన్నారు.

Advertisement

దీనికి పూర్తి పరిష్కారం చేయలేకపోతున్నారు.వెంటనే ఈ ప్రభుత్వం వర్షాకాలం వెళ్లక ముందే సాంకేతికంగా ముందడుగు వేసే సందర్భంలో దిగువకు వెళ్లే కాలనీలను వెడల్పు చేస్తే ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా ఉంటుందని వారన్నారు.

వేములవాడ మొత్తం అష్టదిగ్బంధం జరిగింది.వర్షాకాలం వచ్చిందంటే వేములవాడ చుట్టూ ప్రక్కల అంతట రాకపోకలంతా బంద్ అవుతున్నాయని అన్నారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి వచ్చే భక్తులకు, వేములవాడ నియోజకవర్గం నుండి వచ్చే ప్రజలకు అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్దామంటే రాకపోకలను ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వారన్నారు.వీళ్ళ పరిపాలన వైఫల్యం వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు.

వేములవాడ చుట్టూ లోలెవల్ వంతెనలు తప్ప హై లెవెల్ వంతెనలు కట్టాలన్న ఆలోచన ఈ తండ్రి కొడుకులకు లేకపాయే అని అన్నారు.ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

ప్రజలకు కరోనా కష్టకాలంలో అందుబాటులో ఉండడు ఇంతగానం వర్షాలు పడుతున్నాయి పోయి పట్నంలో హాయిగా ఉండడం విలాసవంతమైన జీవితం గడపడం అతనికి అలవాటైపోయింది.ఎమ్మెల్యే అనే పదం హోదాకు చిహ్నంగా వాడుకుంటున్నాడు తప్ప.

Advertisement

ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొనే పాపాన పోలేని వీల్లు కావాలానా .ప్రజలు ఆలోచించే సమయం ఆసన్నమైందని ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలని తెలిపారు.వేములవాడకు ఈ కష్టాలు రాకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

గ్రామాలలో నుండి వీడియోలు వస్తున్నాయని గోదావరి ని తలపిస్తున్నాయని మొన్ననే వరి నాట్లు వేసిన రైతుల పొలాలు మునిగిపోతున్నాయని దీంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.ఈ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండెలా చూడాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్న ఆ ఇబ్బందిని అధిగమించడానికి సంబంధిత అధికారులను పంపాలని తెలిపారు.

ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, నాయకులు సంగ స్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కోయినేని బాలయ్య, తుమ్ మధు, కనికరపు రాకేష్, నాగుల రవీందర్ గౌడ్, అక్కన పెళ్లి నరేష్, ఖమ్మం గణేష్, తదితరులు ఉన్నారు.

Latest Rajanna Sircilla News