న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటిస్తున్న సరికొత్త మూవీ ”హాయ్ నాన్న’‘.( Hi Nanna ).ఎప్పుడు డిఫరెంట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి మంచి సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని నెక్స్ట్ చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

నాని తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా రాబోతున్న హాయ్ నాన్న సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమా నుండి ఇటీవలే మేకర్స్.దీనికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఓన్లీ టైటిల్ గ్లింప్స్ తో అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా గ్లింప్స్ వచ్చినప్పటి నుండి ఏదొక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా షూట్ నుండి ఒక అప్డేట్ తెలుస్తుంది.ప్రస్తుతం జరుపుకుంటున్న షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ తన షూట్ పూర్తి చేసుకుంది అని సమాచారం.తర్వాత షెడ్యూల్ లో మళ్ళీ ఈమె అడుగు పెట్టనుంది.ఈ సినిమాలో యష్ణా అనే క్యారెక్టర్ లో నటిస్తుండగా ఈ జంట కెమిస్ట్రీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ( Shruti Haasan )తో పాటు బేబీ కియారా ఖన్నా( Kiara Khanna ) కూడా కీ రోల్ పోషిస్తున్నారు.
వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలి మరి నాని దసరా హిట్ ను కొనసాగిస్తారో లేదో.







