సూర్యాపేట జిల్లా:గత నాలుగు రోజులుగా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్)మండలం పాతర్ల పహాడ్ చెరువు కట్ట బుధవారం అర్ధరాత్రి తెగి వరద నీరు ఇళ్లల్లోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.దీంతో ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్‌లు,టీవీలు,బియ్యం, నిత్యావసర సరుకులు నీట మునిగిపోయాయని గ్రామస్తులు తెలిపారు.
కానీ,ఇప్పటి వరకూ అధికారులు ఎవరూ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు.ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందదోనని గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.







