అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`.సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత.షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది.
రాయలసీమ స్లాంగ్, నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ (అధర నా గుండెలధర)ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం.మొదటిసారి ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతున్న సినిమా జైత్ర.
ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి.సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.
నటీనటులు:
సన్నీ, నవీన్, రోహిణి రాచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్.
కెమెరా: మోహన్ చారి, పాటలు : కిట్టు విస్సా ప్రగడ, సంగీతం : ఫణికళ్యాన్, ఎడిటర్: విప్లవ్ నైషదం, దర్శకత్వం : తోట మల్లిఖార్జున్, నిర్మాత: అల్లం సుభాష్, పిఆర్ఒ: నివాస్.