అదానీ గ్రూప్ సంస్థ అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అదానీ కంపెనీ ప్రతి రోజు వేల కోట్ల రూపాయలను కోల్పోతుంది.
తాజాగా ఈ వ్యవహారం పార్లమెంట్ కు చేరింది.
ఉభయ సభల్లో అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.
ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశాయి.దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే విధంగా ఉన్న నివేదికపై చర్చ జరగాలంటూ రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
విపక్షాల నిరసన నేపథ్యంలో ఇరు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.