తెలుగు సినిమా ఇండస్ట్రీకి నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ( Ada Sharma ).తొలినాల్ల నుంచి మోడలింగ్ చేస్తూనే ఓవైపు సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన ఆదా శర్మ కి అంత ఈజీగా అవకాశాలేమీ రాలేదు.2014లో హార్ట్ ఎటాక్( Heart attack ) సినిమాలో నటించిన అంతకు ముందే దాదాపు ఆరేళ్ల క్రితం 1920 అనే సినిమాల్లో మొట్టమొదటిసారిగా హిందీ తెరపై కనిపించి ఆ సినిమా ద్వారానే ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా నామినేట్ కూడా అయింది.అయితే ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లో నటించిన బాలీవుడ్ లో మాత్రం అది బిజీ కాలేక పోయింది తెలుగులో కన్నడలో తమిళ్లో అడపాదడపా కనిపిస్తూ ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తోంది.

హార్ట్ ఎటాక్ సినిమా తర్వాత s/o సత్యమూర్తి సినిమాలో కూడా కనిపించింది.అలాగే గరం, క్షణం, కల్కి వంటి సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడికి పెద్దగా కెరియర్ తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు.అయితే 2015 నుంచి 2017 వరకు ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.ఆ తర్వాత ఒక తమిళ సినిమాలో కనిపించిన మళ్లీ 2019లో ఒక చిత్రంలో కనిపించింది.
ఇక 2023 లో ది కేరళ స్టోరీస్( The Kerala Stories ) అనే చిత్రం వచ్చేవరకు ఆదాశర్మ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు.ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదా శర్మకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.
హిందూ మతంలో పుట్టినప్పటికీ ISIS లో బలవంతంగా మతమార్పిడి జరిగిన పాత్రలో ఆదాశర్మ చక్కగా నటించింది.

ఈ సినిమా తర్వాత చాలామంది అదాశర్మ నటనని మెచ్చుకున్నారు కానీ అవకాశాలు ఇవ్వలేదు.అది కష్టం మీద ఒక రెండు బాలీవుడ్ సినిమాలకు సాయం చేసిన అవి షూటింగ్ దశలోనే ఉన్నాయి.గా ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే ఓకే కానీ లేదంటే అదాశర్మ కెరియర్ దాదాపు ముగిసినట్టే అని అనుకోవాలి.
ఏది ఏమైనా అదా శర్మ నటిగా మంచి మార్కులు వేయించుకుంటుంది కానీ ఎందుకు ఆమెను ఇండస్ట్రీలు పెద్దగా పట్టించుకోవడంలేదని మాత్రం అనుకోవచ్చు.







