రెండు తెలుగు సినిమాలు ఓకే చేసిన ఆదా శర్మ

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ ఆదా శర్మ.మొదటి సినిమాతోనే ఒకే అనిపించుకున్న ఈ అమ్మడు తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు.

అయితే ఈమెకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.వచ్చిన కూడా ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో ఆమె చేసిన పాత్రతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరుగుతాయని అనుకున్న అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇక రాజశేఖర్ తో కల్కీ సినిమాలో హీరోయిన్ గా ఆదా శర్మ నటిస్తుంది.అయితే సినిమాలో ఆమె పాత్రకి అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది.

Advertisement

ఇక హిందీలో కూడా ఈ అమ్మడుకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్ లతో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ అందాల ప్రదర్శన చేస్తున్న కూడా ఈమె వైపు చూస్తున్న దర్శకులు లేరు.

ఈ హాట్ ఫోటో షూట్ ల కారణంగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ మాత్రం పెరుగుతుంది.అయితే ఈ కరోనా టైంలో ఊహించని విధంగా ఈ అమ్మడుకి రెండు రోజుల వ్యవధిలో రెండు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి.

ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే లేడీ ఒరియాంటెడ్ కథలే కావడం విశేషం.లో బడ్జెట్ సినిమాలు అయినా లేడీ ఒరియాంటెడ్ సినిమాలు కావడం ఆదాశర్మకి కొంత కలిసొచ్చే విషయం.

ఈ సినిమాలతో ఈ అమ్మడు తనని తాను ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటుందో అనేది వేచి చూడాలి.

బడా హీరోలకోసం బలగం వేణు వెంపర్లాట... అదే ఆలస్యం చేస్తోందా?
Advertisement

తాజా వార్తలు