తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( adah sharma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలె ది కేరళ స్టోరీ( The Kerala Story movie ) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అదా శర్మ.
మొదట్లో నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే రూ.230 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే 250 కోట్ల మైలురాయలను కూడా దాటనుంది అని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.
ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులర్ సంపాదించుకుంది అదా శర్మ.పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అదా శర్మ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.ఈ సందర్భంగా ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడింది అన్న విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
కేరళ స్టోరీ సినిమా షూటింగ్లో భాగంగా ఆఫ్గానిస్థాన్ లో దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అదా శర్మ.అయితే అందులో ఆమె ముఖానికి గాయాలు అయ్యాయి.
దాదాపు మైనస్ 16 డిగ్రీల వాతావరణం లో 40 గంటల పాటు ఉన్నాము.
డీహైడ్రేషన్ ( Dehydration )కారణంగా నా పెదాలు పగిలిపోయాయి.ఫోటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దాం అనుకున్నారు.కానీ అది జరగలేదు.
దాంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి.ఏదైతేనేం కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.
అందుకు చాలా సంతోషంగా ఉంది అని రాసుకుంది అదా శర్మ.కాగా ఆ ఫోటోలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించగా ఆమె కంటికి చంపలకు ముక్కుకు పెదాలకు ఇలా ముఖమంతా కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.