బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ లలో హీరోయిన్ రేఖ( Heroine Rekha ) ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎన్నో సినిమాలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాకుండా ఆమె అందానికి ఎవరైనా సరే మంత్రం ముగ్గులు కావాల్సిందే.అభిమానులు మాత్రమే కాకుండా తోటి హీరోలు కూడా రేఖ అందాన్ని చూసి ఫిదా అయ్యేవారు.
ఇప్పటికీ అప్ కమింగ్ హీరోయిన్లకు చాలామందికి ఆమె రోల్ మోడల్ గా నిలుస్తూ ఉంటుంది.
ఇక తన ప్రేమ వ్యవహారాలు, రిలేషన్ షిప్స్, బ్రేకప్స్ విషయాలు కూడా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేవి.
ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలో కొన్ని బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంది.అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా ఒకటి.రేఖ ది అన్‌టోల్డ్ స్టోరీ( Rekha The Untold Story ) పేరుతో ప్రచురించిన తన జీవిత చరిత్ర పుస్తకంలో తెలిపింది.బెంగాలీ యాక్టర్ బిస్వజీత్ ఛటర్జీ, అంజనా సఫర్ చిత్ర షూటింగ్‌లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించింది.
కుల్జీత్ పాల్ దర్శకత్వం వహించిన అంజనా సఫర్సినిమా 1969లో విడుదలైంది.
అప్పుడు రేఖకు వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.కానీ ఛటర్జీ వయసు అప్పటికి 33 ఏళ్లు.అయితే, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఆమె సమ్మతి, సమాచారం లేకుండానే సదరు నటుడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడట.
అంతేకాదు ఈ విషయం గురించి దర్శకుడికి కూడా ముందే తెలుసట.ముంబైలోని మహబూబ్ స్టూడియోలో జరుగుతుండగా రొమాంటిక్ సీన్ చిత్రీకరణకు సంబంధించి డైరెక్టర్ కుల్జీత్ పాల్, నటుడు బిస్వజీత్ ముందుగానే ప్లాన్ చేసి అదంతా చేశారు అని రేఖ చెప్పుకొచ్చింది.
ఈ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు చిత్రీకరించగా అప్పటికి చాలా చిన్న ఏజ్‌లో ఉన్న రేఖ భయంతో వణికిపోయినట్లు పుస్తకంలో తెలిపింది.దర్శకుడు యాక్షన్ చెప్పగానే నటుడు బిశ్వజీత్ రేఖను తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదాలపై గట్టిగా కిస్ చేశాడట.దీంతో ఈ సడెన్ ఇన్సిడెంట్‌కు రేఖ ఆశ్చర్యపోయింది.ఒక వైపు కెమెరా రోల్ అవుతూనే ఉండగా దర్శకుడు కట్ చెప్పకపోవడంతో బిశ్వజీత్ ఆమెను ముద్దాడుతూనే ఉన్నాడు.ఇలా ఐదు నిమిషాల పాటు కొనసాగిందట.