పోలవరం ప్రాజెక్టుకు అడ్ హక్ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.అదేవిధంగా ఏపీ విభజన చట్టానికి సంబంధించిన అంశాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
విజయనగరం జిల్లాలో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయానికి రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి అనుమతులు రానున్నాయని పేర్కొన్నారు.
ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ప్రధాని నియమించిన కమిటీ సమావేశం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్ నేతృత్వంలో జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు హాజరైయ్యారు.







