శ్రీహరి చనిపోయి నాకు అన్యాయం చేశాడు.. ప్రముఖ నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా శ్రీహరి( Srihari ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యల వల్ల శ్రీహరి మృతి చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.

 Actress Vizag Jagadeeswari Comments About Srihari Details Here Goes Viral ,actre-TeluguStop.com

శ్రీహరి జీవించి ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి తన వంతు సహాయం చేశారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు( Star Heroes ) సైతం శ్రీహరిని ఎంతగానో అభిమానిస్తున్నారు.

ప్రముఖ నటి వైజాగ్ జగదీశ్వరి ఒక ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.నేను 116 సినిమాలలో నటించినా నాకు సరైన బ్రేక్ రాలేదని ఆమె కామెంట్లు చేశారు.

నేను సింగిల్ టేక్ లో నటించేదానినని జగదీశ్వరి అన్నారు.నేను చిట్టీలు వేసి డబ్బులు పోగొట్టుకున్నానని శ్రీహరి బ్రతికి ఉంటే నా డబ్బులు వచ్చేవని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Actressvizag, Pindam, Srihari-Movie

శ్రీహరి గారు సెటిల్మెంట్స్ చేసేవారని జగదీశ్వరి( Actress Vizag Jagadeeswari ) పేర్కొన్నారు.శ్రీహరి గారిని మొదట కలిసిన సమయంలో నేను బొంబాయి వెళ్తున్నానని వాచ్ మేన్ నంబర్ తీసుకోండని నేను వచ్చిన తర్వాత మీ పనికి సహాయం చేస్తానని ఆయన చెప్పారని జగదీశ్వరి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఒకరోజు టీవీ చూస్తుండగా శ్రీహరి చనిపోయారనే వార్త విన్నానని ఆమె తెలిపారు.దేవుడు శ్రీహరి రూపంలో ఒక అవకాశం ఇవ్వగా నాకు మేలు చేస్తాడని అనుకున్న వ్యక్తి చనిపోయాడని జగదీశ్వరి పేర్కొన్నారు.

Telugu Actressvizag, Pindam, Srihari-Movie

ఇప్పుడు చిన్నచిన్న సినిమాలు చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.పిండం సినిమా( Pindam Movie )లో నా పాత్రకు మంచి పేరు వచ్చిందని ఆమె అన్నారు.ఇప్పుడు ఎవరికి పేరు, ఎవరికి డబ్బు ఉంటే వాళ్లదే రాజ్యమని జగదీశ్వరి వెల్లడించారు.వైజాగ్ జగదీశ్వరి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube