వాసుకి.( Actress Vasuki ) తొలి ప్రేమ( Tholi Prema Movie ) సినిమా నుంచి ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక చెల్లి ఉంటె బాగుటుంది అని అనుకోని వాళ్ళు ఉండరు.
ఆ సినిమా ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అయినప్పటికి చెల్లి సెంటిమెంట్ కూడా చాల బలంగా ఉంటుంది.ఈ సినిమాలో హీరో తన మనసులోని అన్ని బాధలను, భావాలను తన చెల్లి తో పంచుకుంటూ ఉంటాడు.
అందుకే ఆ సినిమా చాల బాగా కుదిరింది.దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు.
తొలి ప్రేమ సినిమా తర్వాత చాల మంది తమ అక్కచెల్లెళ్ళతో ప్రేమగా ఉండటం కూడా మొదలు పెట్టారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక క్లైమాక్స్ లో అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అంటే ఎంతో మంది కంటతడి పెట్టుకున్నారు.

ఇక చెల్లి పాత్రలో వాసుకి నటించడం కూడా ఆ సినిమాకు పెద్ద అసెట్ అయ్యింది.వాసుకి తమిళ్ నటి అయినప్పటికి తెలుగు లో ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆమెకు ఒక్క తొలిప్రేమ సినిమా మాత్రమే కారణం అయ్యింది.తమిళ్ సినిమాల్లో, సీరియల్స్ లో చాల ఏళ్ళ పాటు సపోర్టింగ్ పాత్రలో నటించిన వాసుకి తెలుగు లో మాత్రం చాల తక్కువ సినిమాల్లోనే కనిపించింది.అయినా కూడా ఆమె ఒక తెలుగు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఆనంద్ సాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆనంద్ సాయి మొట్ట మొదటి సారి పని చేసింది కూడా తొలి ప్రేమ సినిమా కోసమే.అయన తొలిసారి తాజ్ మహల్ ని రిక్రియెట్ చేసి సక్సెస్ అయ్యి ఎన్నో పెద్ద సినిమాలకు కూడా పని చేసారు.
ఇక యాదాద్రి టెంపుల్ కి కూడా ఆర్ట్ వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.

అయితే వాసుకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక మళ్లి నటించలేదు.ఆమె పిల్లలతో బిజీ గా ఉన్న టైం లో అన్నవరం సినిమాలో సైతం చెల్లి పాత్రా కోసం ఆమెను సంప్రదించగా చేయను అని చెప్పారట.అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ లో అక్క పాత్రా కోసం అడిగిన కూడా చేయను అంటూ రిజెక్ట్ చేసి ఈ ఆమధ్య యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ పాపులర్ అయ్యి అన్ని మంచి శకునములే సినిమాలో హీరోకి అక్క పాత్రతో రీఎంట్రీ ఇస్తుంది.







