వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar) ప్రస్తుతం వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
అయితే తాజాగా ఈమె ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా టమోటాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి తెలియజేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.మార్కెట్లో కనీస మద్దతు ధర లేక రోడ్లపై పడేస్తున్నటువంటి రైతులను ఇప్పుడు అదే టమోటాలు కోటీశ్వరులను చేస్తుంది.

కిలో టమోటాలు (Tomato) దాదాపు 150 రూపాయల వరకు ధర ఉండడంతో టమోటా రైతులు కోటీశ్వరులుగా మారిపోయారు.దీంతో ఎంతోమంది టమోటోలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వీడియోస్ చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టమోటాలకు ఎంత గిరాకీ ఉందనే విషయాన్ని తెలియజేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా గోడపై టమోటాల బ్యాగుతో పాటు తన సెల్ ఫోన్ పక్కన పెట్టి మరొక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు.

ఈ విధంగా వీరిద్దరూ మాటలలో మునిగిపోతారు అయితే వెనుక వైపు నుంచి ఓ దొంగ వచ్చి వరలక్ష్మి ఫోన్ దొంగలిస్తారు.దాంతో అమ్మాయి మీ ఫోన్ దొంగలించారని చెప్పడంతో ఫోనే కదా పోతే పోనీలే అని వరలక్ష్మి కూడా లైట్ తీసుకుంటుంది.అయితే ఆ దొంగ మళ్ళీ వచ్చి తన సెల్ ఫోన్ అక్కడే పెట్టి పక్కనే ఉన్నటువంటి టమోటో బ్యాగ్ దొంగలిస్తారు దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఆ దొంగను పట్టుకోవడానికి పరుగులు పెడతారు.ఇలా ఈ ఫన్నీ వీడియోని షేర్ చేస్తూ టమోటాలకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో చెప్పకనే చెప్పేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.







