Tamannaah Bhatia : కాశీ టెంపుల్ లో పూజలు చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. పూజలు చేయడానికి కారణాలు ఇవేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Actress Tamannaah Bhatia Visited Varanasi Kashi Temple-TeluguStop.com

మూడు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

అప్పుడప్పుడు వెబ్ సిరీస్( Web Series ) లలో కూడా నటిస్తోంది మిల్కీ బ్యూటీ.కాగా తమన్నా వయసు పెరిగే కొద్దీ ఆమె అందం కూడా మరింత పెరుగుతూనే ఉంది.

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇంకా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది తమన్నా.సినిమాలతో పాటు అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్( Commercial Ads ) లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది.ఇకపోతే తమన్నా గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ మధ్య కాలంలో ఆలయాలు, దేవస్థానాలను సందర్శించడం మొదలుపెట్టింది.

ఇందులో భాగంగానే వారణాసిలోని కాశీలోని శివాలయాన్ని( Kashi Shivalayam ) సందర్శించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.ఫోటోలతో పాటు హర్ హర్ మహాదేవ్ అనే క్యాప్షన్‌ ని కూడా జోడిచింది.తమన్నా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తమన్నా ఆలయ సందర్శనం సింపుల్‌గా జరిగింది.కొన్ని రోజుల క్రితమే నటి ప్రసిద్ద కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లినట్లుగా ఆ ఫోటోలను షేర్ చేసుకుంది.తమన్నా తన ఫ్యామిలీతో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube