తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి (Surekha Vani) ఒకరు.తెలుగు సినిమాలలో అక్క పిన్ని వదిన పాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.ఇలా సినిమాలను తగ్గించినటువంటి ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు.
తన కుమార్తె సుప్రీత(Supritha) తో కలిసి సోషల్ మీడియాలో సురేఖ వాణి చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు.

ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా పొట్టి పొట్టి దుస్తులు దరించి ట్రెండింగ్ పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తుంటారు.ఇలా సోషల్ మీడియా ద్వారా వీరిద్దరు భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఇప్పటివరకు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైనటువంటి సురేఖవాణి కుమార్తె సుప్రీత ఇకపై హీరోయిన్గా వెండి తెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
సుప్రీత హీరోయిన్గా మొదటి సినిమా అవకాశాన్ని అందుకున్నారు.

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అయ్యి అనంతరం బిగ్ బాస్ (Bigg Boss) అవకాశాన్ని అందుకున్నటువంటి నటుడు అమర్ దీప్ చౌదరి (Amar Deep Chowdary) హీరోగా తన మొదటి సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో( Prasad Lab ) ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రస్తుతం ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా అమర్ సుప్రీత హీరో హీరోయిన్లుగా మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా నటి సురేఖ వాణి కూడా పాల్గొని సందడి చేశారు.ఈ పూజా కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం సురేఖ వాణి మాట్లాడుతూ ఈ సినిమా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అమర్ నాకు తమ్ముడు లాంటివాడు అని సురేఖ వాణి కామెంట్ చేశారు.
ఒక ఆడపిల్ల తల్లిగా నేను కూడా తన కుమార్తెను ఇండస్ట్రీలోకి పంపించడానికి భయపడుతున్నానని ఈమె వెల్లడించారు.అయితే తన కుమార్తెకు ఒక అద్భుతమైన టీం దొరికిందని నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా నా కూతురిని వారి చేతుల్లో పెడుతున్నాను అంటూ సురేఖ వాణి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







