తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సునయన( Actress Sunaina ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కుమారి వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.తమిళ హీరో విశాల్ నటించిన లాఠీ సినిమాతో( Latthi Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈమె కోలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ సునయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ ముద్దుగుమ్మ రెండు రోజులుగా గత రెండు రోజులుగా కనిపించడం లేదట.
ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సునయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుంది.అంతే కాకుండా గత రెండు రోజులుగా ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు.
దాంతో అభిమానులు సునయనకు ఏం జరిగిందో అంటూ కంగారు పడుతున్నారు.ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో వారు సునయనను వెతకడం కోసం రంగంలోకి దిగారు.
ప్రస్తుతం సునయన ఎయిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న రెజీనా అనే సినిమాలో నటిస్తోంది.కాగా ఈ సినిమా దాదాపు 4 భాషల్లో విడుదల కానుంది.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.తాజాగా సునయన కనిపించడం లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ తో ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని.ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దాంతో సునయన మిస్సింగ్, కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చాయి.ఆమె ఫ్యాన్స్ సునయనకు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు.ఈ వార్త కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో వారు సునయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఎగ్మూర్ నుంగంబాక్కం, కోయంబేడు, విరుగంబాక్కం ప్రాంతాల్లో సునయన సంచరించిందన్న సమాచారం తెలియడంతో ఆ ప్రాంతాలకు వెళ్లి ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు.కాగా పోలీసులు సునయన కోసం వెతుకుతుండగానే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.ఇదంతా సినిమా ప్రమోషన్‌లో( Movie Promotions ) భాగం అంటూ చావు కబురు చల్లగా చెప్పారు చిత్ర యూనిట్.
రెండు రోజులుగా జనాలను, పోలీసులను కంగారు పెట్టారు కదా అంటూ మండి పడుతున్నారు నెటిజన్స్.ఇంకొందరు నెటిజన్స్ సినిమా ప్రమోషన్ కోసం మరి ఇంత దిగజారాలా అంటూ మండి పడుతున్నారు.