రేయ్ మోహన్ బాబు రా రా.. వీరంగం సృష్టించిన నటి.. వీడియో వైరల్!

నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

మంచు విష్ణుతో పాటు ఇతర పదవులకు ఎంపికైన సభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే అదే సమయంలో నటి శ్రీనిజ నాయుడు మోహన్ బాబు, అతని కుటుంబంపై ఇష్టానుసారం కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచారు.వీకే నరేష్ గారు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనకు చేతనైనంత వరకు చేశారని శ్రీనిజ నాయుడు అన్నారు.

వీకే నరేష్ సభ్యులను పిలిచి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉంటే బాగుండేదని శ్రీనిజ నాయుడు చెప్పుకొచ్చారు.పని చేయడానికి వచ్చిన ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో దూరిపోయి వాళ్ల అప్పులు, ఆస్తులు, ఇళ్లు, వాకిళ్ల గురించి బయటపెట్టి వీకే నరేష్ తన చేతకానితనాన్ని బయటపెట్టారని శ్రీనిజ నాయుడు పేర్కొన్నారు.

నరేష్ చేసిన అవకతవకలను బయటపెడితే ముండమోపి అన్నారని శ్రీనిజ నాయుడు వెల్లడించారు.చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఏ సెక్యూరిటీ ఇవ్వగలిగారని శ్రీనిజ ప్రశ్నించారు.

Advertisement

విష్ణు గెలవడం నాకు ఇష్టం లేదని మోహన్ బాబు అధ్యక్షుడిగా చేసినా ఏం చేయలేదని శ్రీనిజ పేర్కొన్నారు.మంచు ఫ్యామిలీ అంతా ప్రమాణ స్వీకారం నుంచి వెళ్లిపోవాలని శ్రీనిజ పేర్కొన్నారు.మోహన్ బాబు సీఎం జగన్ కాళ్లు, వేళ్లు పట్టుకుని మా ఎన్నికల్లో సహకరించాలని జగన్ ను కోరారని శ్రీనిజ చెప్పుకొచ్చారు.

రేయ్ మోహన్ బాబు.రా రా.అపరకాళిలా నేను వచ్చాను.నన్ను ఎదుర్కో.

నా ప్రాణం పోయినా పరవాలేదని శ్రీనిజ వెల్లడించారు.ప్రమాణ స్వీకారం దగ్గర శ్రీనిజ గందరగోళం సృష్టించగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

అయితే శ్రీనిజ చేసిన ఆరోపణల గురించి మోహన్ బాబు లేదా అతని ప్యానల్ సభ్యులు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు