శ్రీదేవి తన తొలి డ్యుయెట్ ఒక కమెడియన్ తో చేసింది అని మీకు తెలుసా ?

అదేంటి ? శ్రీదేవి రాజబాబు డ్యూయెట్ చేయడమేంటి ? ఇది నిజానికి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజం.వీరిద్దరూ కలిసి ఒక పాటలో ఆడిపాడారు ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం పదండి.

 Actress Sridevi First Duet Song With Comedian Raja Babu Devudu Lanti Manishi Mov-TeluguStop.com

రాజబాబు ఒకప్పుడు కమెడియన్ గా వెలుగొంది స్టార్ హీరోల కన్నా కూడా ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.తనదైన బక్కపలచని రూపంతో నవ్విస్తూ నవ్వుల రారాజు గా చరిత్రలో ఒక వెలుగు వెలిగాడు.

తెరపై రాజబాబు కనిపిస్తే చాలు అందరి మొహాల్లో చిరునవ్వే కనిపించేది.రాజబాబు కమెడియన్ గా ఒక స్థాయిని అనుభవిస్తున్న సమయంలోనే హీరోగా కూడా ప్రయోగాలు చేశాడు.

రాజబాబు హీరోగా నటిస్తే హీరోయిన్స్ గా నటించిన వారిలో విజయనిర్మల వాణిశ్రీ శ్రీదేవి వంటి హీరోయిన్లు ఉన్నారు.

ఇక రాజబాబు శ్రీదేవి విషయానికొస్తే శ్రీదేవి అప్పుడప్పుడే తెలుగు తెరకు పరిచయమైంది 1975 లో దేవుడు లాంటి మనిషి అనే సినిమాలో రాజబాబు శ్రీదేవి కలిసి నటించారు.

ఇదే సినిమాలో శోభన్ బాబు మంజుల లీడ్ రోల్ పోషించారు.అయితే ఈ సినిమాలోనే రాజబాబు సరసనా శ్రీదేవి ఒక డ్యూయెట్ చేసింది నిజానికి ఇది శ్రీదేవికి మొట్టమొదటి డ్యూయెట్ కావడం విశేషం.

Telugu Rajababu, Sridevi-Telugu Top Posts

ఇక ఆ తర్వాత కాలంలో  శ్రీదేవి ఇండియన్ సినిమాను తన కనుసైగలతో శాసించే స్థాయికి ఎదిగింది.ఆ తర్వాత కాలంలో తెలుగు,  తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పతాక స్థాయికి ఎదిగింది.మూడు తరాల హీరోలతో ఏకంగా 20 ఏళ్లపాటు ఏకచ్ఛత్రాధిపత్యం చేసిన నటి గా శ్రీదేవి చరిత్రలో నిలిచిపోయింది.ఓ వైపు సీనియర్ ఎన్టీఆర్, మరోవైపు అక్కినేని వంటి వారి సరసన ఆడి పాడింది.

ఆ తర్వాత జనరేషన్ అయిన చిరంజీవి, నాగార్జున వంటి హీరోలతో సైతం నటించింది.ఇలా ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ రీతిలో విజయాలను అందుకుంది.హీరో కన్నా కూడా ఎక్కవగా పారితోషకం తీసుకునే హీరోయిన్ గా శ్రీదేవి చరిత్ర సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube